Sunday, December 22, 2024

హైకోర్టులో ‘రీ-చెక్ యువర్ ఓటు’ కౌంటర్ పరిశీలన

- Advertisement -
- Advertisement -

న్యాయవాదులకు అవగాహన కల్పించిన ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు చెల్లదని తుది ఓటరు జాబితాలో మీ పేరును రీ-చెక్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. గురువారం హైకోర్టులో స్వీప్ ఆక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ-చెక్ యువర్ ఓట్ కౌంటర్ ను డిప్యూటీ డిఈఓ అనుదీప్ దురిశెట్టి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ప్రొటోకాల్ శ్రీధర్ రావు, ప్రొటోకాల్ ఇన్ప్రాస్ట్రక్చర్ నర్సింగ్ రావులతో పాటు హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరును ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు.

voter.eci.gov.in లేదా voter helpline app ద్వారా ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 ను సంప్రదించాలని ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమీషనర్ వెంకన్న, స్వీప్ నోడల్ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, జాయింట్ కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News