Sunday, January 19, 2025

జ్ఞానవాపిపై నేడు తిరిగి విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వారణాసి జ్ఞానవాపి మసీదు వ్యాజ్యంలో ఇరు పక్షాలవాదనలు కొనసాగుతున్నాయి. ఈ దశలో గురువారం వరకూ ఆర్కియాలాజికల్ సర్వే చేపట్టరాదని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సర్వే గురించి తమ నిర్ణయం ఖరారు అవుతుందని, విచారణ తిరిగి గురువారం ఆరంభం అవుతుందని న్యాయస్థానం బుధవారం తెలిపింది. ఈ మసీదు ఆవరణలో మందిరం ఉందనే వివాదానికి సంబంధించి ఆర్కియాలిజికల్ సర్వే నుంచి మరింత వివరణకు కోర్టు ఆదేశించింది. దీనిని పరిశీలించి సర్వే విషయంతో తాము తుది నిర్ణయానికి వస్తామని న్యాయస్థానం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇక్కడ మసీదు నెలకొని ఉండి ఇప్పటికీ వేయి సంవత్సరాలు అవుతోందని మసీదు కమిటీ తెలిపింది.

సర్వే పేరిట ఇక్కడ జరిగే ఎటువంటి తవ్వకాలు అయినా ఈ చారిత్రక కట్టడం దెబ్బతినేందుకు దారితీస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దేవాలయం ఇక్కడ 1585లో కట్టారని, దీనిని 1669లో కూల్చేశారని హిందూపక్షం వాదించింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేపై స్టే విధించాలని మసీదు కమిటీ కోరింది. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఓ వైపు సర్వే సంస్థ తమ చర్యలతో కట్టడానికి ఎటువంటి ముప్పు ఉండదని చెపుతోంది. దీనిని కమిటీ విశ్వసించకపోతే ఇక కోర్టు రూలింగ్‌ను నమ్ముతారా? అని ప్రశ్నించింది. తాము వివరణలు కోరుతున్నామని, తిరిగి గురువారం విచారణ ఆరంభం అయ్యే వరకూ సర్వే నిలిపివేస్తున్నామని తెలిపింది.

రామజన్మభూమి స్థలం గురించి జరిపినట్లే ఇక్కడ కూడా ఆర్కియాలాజికల్ సర్వే జరగాల్సి ఉందని హిందూ పక్షం కోరింది. దీనిని మసీదు కమిటీ వ్యతిరేకించింది. ఈ రెండింటికి పోలిక లేదని, రెండింటికి ఒకే పద్ధతి కుదరదని తెలిపింది. ఎఎస్‌ఐ సర్వేనే ఈ మసీదు విషయంలో తుది నిర్ణయానికి దారితీసే నిపుణుల స్థాయి స్పష్టత ఇస్తుందని హిందూ వర్గాలు వాదించాయి. విచారణ తిరిగి గురువారం సాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News