Friday, November 22, 2024

బాల్ టాంపరింగ్‌పై మళ్లీ విచారణ

- Advertisement -
- Advertisement -

Re-trials on ball tampering:Australia cricket

ఆస్ట్రేలియా క్రికెట్‌లో బెన్‌క్రాఫ్ట్ ప్రకంపనలు

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రికెటర్లలో ఒకడైన కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ ఒక ఇంటర్వూ సందర్భంగా ఈ ఉదాంతానికి సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బెన్‌క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యాల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయంలో మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. ఇందు లో భాగంగా 2018 బాల్ టాంపరింగ్ వివాదానికి సంబంధిం చి ఏదైనా సమాచా రం ఉంటే తమకు తెలిపాలని ఆస్ట్రేలి యా క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లను కోరింది. బాల్ టాంపరింగ్ గురించి తెలిసిన క్రికెటర్లు తమ అభిప్రాయాలను ధైర్యంగా బోర్డు ముందు ఉంచాలని, ఒక వేళ ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే దీనికి పాల్పడినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని బోర్డు స్పష్టం చేసింది.

అంతేగాక అవసరమైతే బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేదానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లను మరోసారి విచారించాలని బోర్డు భావిస్తోంది. ఇదిలావుండగా బాల్ టాంపరింగ్ గురించి ఆ టెస్టు మ్యాచ్ ఆడిన బౌలర్లందరికి తెలుసని బెన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ వివాదాస్పద టెస్టు మ్యాచ్‌లో మిఛెల్ స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ వంటి స్టార్ బౌలర్లు బరిలోకి దిగారు. దీంతో వీరందరిలో ఒక రకమైన ఆందోళన మొదలైనట్టు సమాచారం. కాగా, అప్పట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్‌క్రాఫ్ట్ జేబులో ఉప్పు కాగితం పెట్టుకొని బంతికి రుద్దిన సంఘటన పెను సంచలనం సృష్టించింది. బెన్‌క్రాఫ్ట్ చర్యలు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బాల్ టాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై ఆసీన్ క్రికెట్ క్రికెట్ బోర్డు నిషేదం విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News