Saturday, December 21, 2024

23న పాళెంలో ఆర్‌ఇఎసి సమావేశాలు

- Advertisement -
- Advertisement -

TS govt written off loans to 12280 Farmers

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహామండలి (ఆర్‌ఇఎసి) సమావేశాలు ఈ నెల 23నుంచి ప్రారంభం కానున్నట్టు సదరన్ తెలంగాణ జోన్ రీసెర్చ్ విభాగం ఆసోసియేట్ డైరెక్టర్ డా.ఎం.గోవర్ధన్ తెలిపారు. పాళెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆవరణంలో జరిగే ఈ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశాలకు రైతులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు , ఎన్జీవోలు, వ్యవసాయ వర్శిటి శాస్త్రవేత్తలు హజరుకానున్నట్టు తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో జరిగిన పరిశోధన, విస్తరణ కార్యక్రమాల సమీక్షతోపాటు 202223 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను ఈ సమావేశాలలో ఎంపిక చేయనున్నట్టు ఎడిఆర్ డా. గోవర్ధన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News