Wednesday, January 22, 2025

ఉదయం 9.45 లకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి  : గ్రూప్ 4 అభ్యర్థులు జులై 1 న జరిగే పరీక్షకు శనివారం ఉదయం 9.45 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గ్రూప్ 4 పరీక్ష రాసే అభ్యర్థులు ఈ కింది సూచనలు పాటించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో చెప్పారు. రెండవ పేపర్ కోసం శనివారం మద్యాహనం 2.15 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని పేర్కొన్నారు. జులై 1 న ఉదయం 10 గంటల నుంచి మద్యాహనం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుటందని తెలిపారు. పరీక్షా కేంద్రంలో టీఎస్పీస్సీ గైడ్లైన్స్ పటిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత చీప్ సూపరిండెట్ల దేనని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

బంగారు ఆభరణాలు ధరించవద్దని తెలిపారు. పరీక్షకు అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు మహిళలకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధార్/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసున్స్ ఒరిజినల్ తీసుకుని రావాలని చెప్పారు. గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం గేటు మూసి వేస్తారని సూచించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 9.45 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం గేటు మూసిన తరువాత ఎవరిని లోపలికి అనుమతించబడదని తెలిపారు. జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పోలీసుల ఆద్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి నిబందనలు పాటిస్తూ తరలించాలని చెప్పారు. పరీక్ష సమయం పూర్తి అయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోనే ఉండాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News