Monday, December 23, 2024

దోతిగూడెంలో పేలిన రియాక్టర్…ఎగిసిపడుతున్న మంటలు!

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఎస్ విఆర్ లాబొరేటరీస్ లో సాల్వెంట్ ను  రీసైక్లింగ్ చేస్తుండగా రియాక్టర్ పేలింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమయానికి ఫైర్ ఇంజన్లు రాలేదు. దాంతో కంపెనీ సిబ్బందే కంపెనీ ఫైర్ శకటంతో మంటలు ఆర్పుతున్నారు.

ఏడాది కాలంలో ఇదే పరిశ్రమలో జరిగిన రెండో అగ్ని ప్రమాదం ఇది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా పరిశ్రమను నడిపిస్తున్నారని వాదిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో పరిశ్రమ సిబ్బందికి ఎటువంటి గాయలు, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News