Wednesday, January 22, 2025

శ్రీకాకుళంలో భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమావరంలో భారీ పేలుడు సంభవించింది. సరాక కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నల్లటి పొగ మేఘం దట్టంగా అలుముకుంది.

భారీ పేలుడు శబ్దానికి జనం జడుసుకున్నారు. అగ్నిమాపక దళం సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు.ప్రస్తుతానికైతే మంటలను వారు ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News