Wednesday, January 22, 2025

పుస్తక పఠనం..ఙ్ఞానాభివృద్ధికి మార్గం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్: పుస్తక పఠనం ద్వారా ఙ్ఞానం, పద సంపద పెరుగుతుందని విద్యార్థుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల అవగాహన వస్తుందని నాగర్‌కర్నూల్ డిఈఓ గోవిందరాజులు అన్నారు. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని నాగనూల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను డిఈఓ గోవిందరాజులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న 6, 7,8వ తరగతుల విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్, హింది భాషలలో పుస్తక పఠనం చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు బాగా చదివే విద్యార్థులు అన్ని సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోగలరని, అందుకు విద్యార్థులు ప్రతి రోజు పుస్తకాలను చదివే అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పుస్తక పఠనం కార్యక్రమాలను ప్రతి తరగతి గదిలో అమలు చేయాలని డిఈఓ ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి బోర్డుపై రాయించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. నూతన మెనూను అమలు చేయాలని ఆదేశించారు. కూరగాయలతో మిక్స్‌డ్ కర్రీని, వారం మూడు రోజులు గుడ్లు పెట్టాలని, మంచి రుచికరంగా అందించాలని సూచించారు. డిఈఓ వెంట పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News