Sunday, December 22, 2024

సమరానికి సై

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలు ఖరారు
మోడీ ఇజాన్ని ఎండగట్టాలి: సిడబ్ల్యూసి

న్యూఢిల్లీ : ఇక ఎటువంటి జాప్యం లేకుండా లోక్‌సభ ఎన్నికలకు సంసిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ అయిన ఎఐసిసి సమావేశం గురువారం దాదాపు నాలుగు గం టల పాటు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ‘సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు పార్టీపరంగా, ఇండియా కూటమి సభ్య పక్షంగా సర్వవిధాలుగా సమాయత్తం కావాల్సి ఉంది’ అని తీర్మానించారు. పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సారధ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పటి నుంచే ఎన్నికలకు సర్వం సన్నద్ధతతో శ్రేణులన్ని సాగాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది. వచ్చే వారం నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ స్థాపిత దినోత్సవం నేపథ్యంలో ‘హే తయ్యార్ హమ్’ (మేము సిద్ధం) నినాదంతో బహిరంగ సభ నిర్వహించాలని ఎఐసిసిలో నిర్ణయించారు.

లోక్‌సభ ఎన్నికలకు సాధ్యమైనంత త్వరగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇందుకోసం ఈ నెలాఖరులోనే స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇతర ప్రముఖ నేతలు ఎఐసిసి భేటీలో పాల్గొన్నారు. సమావేశ వివరాల ను ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయనే అలసత్వం వద్దు, ఇప్పటి నుంచే ఎన్నికల దశ మానసికతను సంతరించుకోవాల్సి ఉంటుంది. ఒక్కటి రెండు రో జులల్లోనే పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించేందుకు దీని ద్వారా వీలేర్పడుతుందని కెసి వేణుగోపాల్ చెప్పా రు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా లోతు గా విశ్లేషణ జరిపారు. మూడు రాష్ట్రాల్లో పరాజయం పట్ల విశ్లేషణ జరిగింది.

ఈ ఫలితాలు నిరాశజనకం అని, అయితే రాబోయే ఎన్నికలలో తగు విధంగా స్పందించేందుకు దీనిని ఓ అవకాశంగా మల్చుకోవల్సి ఉంటుందని నిర్ణయించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీని పలు స్థాయిలలో బలోపేతం చేసేందుకు వీలు కల్పించింది. సమాజంలోని పలు వర్గాలకు కాంగ్రె స్ నిజమైన ఆప్త స్నేహ హస్తం అందిస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది. ఈ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుం ది. అందుకే రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను 2.0 యాత్రగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని, ఈ మేరకు రాహుల్‌గాంధీని అభ్యర్థించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమి, విజయం దరిదాపుల్లోకి వచ్చిందనుకున్న మధ్యప్రదేశ్‌లో పరిస్థితి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జీల నుంచి స్పందన తెలుసుకున్నారు. పార్లమెంట్‌లో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ల విష యం గురించి భేటీలో చర్చించారు.

ప్రతిపక్షాలను సభలో లేకుండా చేసి అత్యంత నిరంకుశ క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం ఆమోదింపచేసుకుందనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే కేడర్ పరంగా లీడర్ల పరంగా అన్ని రకాలుగా సంఘటితంగా మెదిలి, విశ్వాసం సంతరించుకోవాలి. అంకితభావం, ఇదే క్రమంలో క్రమశిక్షణతో పార్టీ ప్రచారానికి శ్రేణులు సిద్ధం కావల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. బిజెపి, బిజెపి మిత్రపక్షాలకు అత్యంత సమర్ధవంతం అయిన అడ్డుకట్టగా, దుర్భేధ్య ప్రాకారంగా ఇండియా కూటమిని తీర్చిదిద్దుకోవాలని తీర్మానించారు. ఈ దిశలో కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా చిత్తశుద్ధితో అన్ని చర్యలూ తీసుకుంటుందని, ఈ విధం గా ముందుకు సాగేందుకు నిర్ణయించుకుందని తీర్మానం లో తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం అన్ని విధాలుగా దాడులకు గురవుతోంది. ప్రజలకు రాజ్యాంగ ప్రసాదితమైన అన్ని రకాల స్వేచ్ఛలపై సంకెళ్లు పడుతున్నాయి. ఈ ప్రక్రియను ఎదిరిస్తూ, ఇప్పుడు సాగుతోన్న తంతును ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజా తీర్పు కోరాలని కాంగ్రెస్ తీర్మానించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News