Wednesday, January 22, 2025

ఛలో నల్లగొండ సభకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి : కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కృష్ణా పరివాహక ప్రాంత రైతులను జాగృతం చే సేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మంగళవా రం బిఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ చౌరస్తాలో నిర్వహించ తలపెట్టిన ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బిఆర్‌ఎస్ పోరు బాట పట్టింది. సభ సజావుగా సాగేందుకు వీలుగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నీ తానై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభా స్థలిని ఏర్పాటు చేశారు.

గులాబీ జెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో నల్లగొండ పట్టణమంతా గులాబీ మయమైంది. పార్టీ అధినేత కెసిఆర్ ప్రసంగం కోసం పార్టీ క్యాడర్, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ జరిగే రోజు నల్లగొండ పట్టణంలో వినూత్న రీతిలో పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా గతంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ నల్లగొండ జిల్లాకు ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేస్తామని వెల్లడించారు. అలాగే మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఛలో నల్లగొండ సభను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఛలో నల్లగొండ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News