Monday, April 7, 2025

అదరగొట్టిన ఫస్ట్ షాట్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. శ్రీరామ నవమి శుభ సందర్భంగా నిర్మాతలు ఫస్ట్ షాట్‌ను రిలీజ్ చేశారు. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘పెద్ది’ కోసం భారీ సంఖ్యలో జనం నినాదాలు చేయడంతో ఫస్ట్ షాట్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది.

రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రలో సిగార్ తాగుతూ భుజంపై బ్యాట్‌తో క్రికెట్ మైదానంలోకి పవర్‌ఫుల్‌గా అడుగుపెడతారు. అతని ఎంట్రీ ఐకానిక్‌గా వుంది. ‘ఒకటే పనిసేసే నాకి.. ఒకేనాక బతికే నాకి.. ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడ్తామా యేటి మళ్ళీ.. సెప్మి..’అంటూ ‘పెద్ది’ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పరిగెత్తుకుంటూ, విశాలమైన వరి పొలాల గుండా దూకడం, చివరకు క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టడం, క్రీజు నుంచి బయటకు అడుగుపెట్టి, బ్యాట్ హ్యాండిల్‌ను నేలకు కొట్టి, బంతిని మైదానం దాటించడం.. గూస్‌బంప్స్ తెప్పించింది.

పొడవాటి జుట్టు, రగ్గడ్ గడ్డం, నోస్ రింగ్‌తో కూడిన రామ్ చరణ్ ఇంటెన్స్ న్యూ లుక్ క్యారెక్టర్ రా నెస్ ని తెలియ జేస్తోంది. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా వున్నాయి. విజయనగరం మాండలికాన్ని పలికిన విధానం అదిరిపోయింది. ఈ ప్రారంభ సన్నివేశంలోని డైలాగ్స్ పెద్ది పాత్ర లైఫ్ ఫిలాసఫీని తెలియజేస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్ ని అత్యద్భుతంగా చూపించారు.ప్రతి షాట్, ప్రతి మూమెంట్ గొప్పగా తీర్చిదిద్దారు. పెద్ది ఫస్ట్ షాట్ మార్చి 27, 2026న సినిమా రిలీజ్ పై అంచనాలను మాసివ్‌గా పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News