Monday, December 23, 2024

చావడానికైనా సిద్ధం…యుపి వెళ్లడానికి భయపడను: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతలపై మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతీఖ్ అహ్మద్‌ను, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లో పోలీసు కస్టడీలో హత్య చేయడాన్ని నిందించారు. ర్యాడికలైజేషన్‌ను నివారించాల్సి ఉందన్నారు. తాను ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లడానికి భయపడబోనని అసదుద్దీన్ అన్నారు.

అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వాన్ని నడపడంలేదు, అక్కడ కేవలం తుపాకీ రాజ్యం నడుస్తోంది. ఈ తాజా హత్యల వెనుక ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బిజెపి పాత్ర ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై దర్యాప్తు జరపాలి. అందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేయాలి. కమిటీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఏ అధికారిని ఉంచకూడదు. ఇదో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్’ అన్నారు.

‘ర్యాలికలైజేషన్‌ను ఆపడానికి నేను చావడానికైనా సిద్ధమే. నేను తప్పక ఉత్తర్‌ప్రదేశ్ సందర్శిస్తాను. నేనేమి భయపడ్డంలేదు. జబ్ ప్యార్‌కియాతో డర్నా క్యా’ అని కూడా తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన నిలదీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News