Sunday, January 19, 2025

ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తనపై ఆరోపణలు రుజువైతే తనకు తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం ప్రకటించారు. తనపై వచ్చిన ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుని చనిపోతానని ఆయన చెప్పారు.

Also Read: చంద్రబాబును చంపాలని చూస్తున్నారు: బోండా

మహిళా రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలంటూ ఆయన నిరసన తెలియచేస్తున్న రెజ్లర్లకు సవాలు విసిరారు. ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోనందుకు నిరసనగా తమ పతకాలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దేశానికి చెందిన అగ్ర రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మంగళవారం హరిద్వార్‌కు వెళ్లిన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ నుంచి బుధవారం ఈ స్పందన వ్యక్తమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News