Sunday, December 22, 2024

ఇండియాలో మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధం: అమెజాన్ సిఇఒ

- Advertisement -
- Advertisement -

ఇండియాలో అదనంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీని ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కార్యనిర్వాహక ప్రధాన అధికారి ఆండీ జెస్సీ కలిశారు. తాను ప్రధాని మోడీతో ఫలప్రదమైన చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జెస్సీ తెలిపారు. పలు విషయాలపై తమ మధ్య సంప్రదింపులు జరిగాయని చెప్పారు.

ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెడుతామని.. దీంతో సంస్థ మొత్తం పెట్టుబడుల విలువ 26 బిలియన్ల డాలర్ల స్థాయికి చేరుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్ సిఇఒతో ప్రధాని మోడీ సంప్రదింపులు చాలా ప్రయోజనకరంగా సాగాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నారు.

Also Read: ‘భోళా శంకర్’ టీజర్ వచ్చేసింది…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News