Friday, November 15, 2024

ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ శుభాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్: ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల పంట కోనుగోలు చేశామని చెప్పారు. సిఎం కెసిఆర్ ఉద్దేశ్యం రైతును రాజును చేయాలనేదే అన్నారు. రైతులకు కోసం సిఎం కెసిఆర్ నిరంతరం ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రతి పక్షం అంటే సద్విమర్ష చేయాలి కానీ, ప్రతి పక్షాలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఉష్ణోగ్రత శాతం ఎక్కువగా ఉండడంతో నూకలు శాతం ఎక్కువ ఉంటుందని.. ప్రతి పక్షాలు మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు.రాష్ట్రంలోని ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఇందులో భాగంగా జనుమును ఇతర రాష్ట్రం నుండి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సూచనతో తన 54 ఎకరాల్లోనూ మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గుమ్మడి, జనుము, పత్తి పంటలను సాగు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Ready to prepare for alternative crops: MLC Subhash Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News