- Advertisement -
తిరుపతి: ప్రముఖ నటుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసని అలీ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పై పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను 2024లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు రెడీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎవరి పైనైనా పోటీచేస్తానని వెల్లడించారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం సాధారణం అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడే, కానీ స్నేహం వేరు రాజకీయాలు వేరు అని చెప్పుకొచ్చాడు. 2024లో వైఎస్ఆర్ సీపీ 175కు 175 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని అలీ జోస్యం చెప్పారు.
- Advertisement -