బీజింగ్ : ఈ ఏడాది జి20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని మద్దతు పలుకుతూ , ఈ సదస్సు అన్ని విధాలా విజయవంతం కావడానికి అన్ని దేశాలతో సమష్టిగా పనిచేయడానికి తాము సిద్ధమేనని చైనా వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ జి20 సదస్సుకు హాజరవుతారని ప్రకటించిన మరునాడే చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. జి20 సదస్సు అన్నది అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ఏర్పాటయ్యే ప్రధాన వేదిక అని, ఆమె పేర్కొన్నారు. సరిహద్దు వివాదం ప్రస్తావన లేకుండా చైనాభారత్ సంబంధాలు మొత్తం మీద సుస్థిరంగా ఉన్నాయని,
రెండు వైపులా అన్ని స్థాయిల్లో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సంబంధాల కొనసాగింపు ఉభయ దేశాల ప్రజల సాధారణ ప్రయోజనాలను నెరవేర్చుతాయని తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తరఫున జి20 సదస్సుకు హాజరుకానున్న ప్రీమియల్ లీకియాంగ్ ఈనెల 5 నుంచి 8 వరకు ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియన్ సదస్సుకు హాజరు కానున్నారు. జకార్తాలో తూర్పు ఆసియా సదస్సుకు హాజరైన తరువాత ఆయన భారత్‌కు వస్తారు.