కీసర: కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో సంచనలం సృష్టించిన రియల్టర్ అశోక్‌కుమార్ హత్య కేసును పోలీసులు చేదించారు. మృతుడు అశోక్ కుమార్ 23 ఏళ్ల క్రితం బాంబు దాడి చేసి తమ కుటుంబ సభ్యులను గాయపరిచి, 2001 నుండి 2004 వరకు తన అనుచరులతో కలిసి కుటు ంబ సభ్యులను హత్య చేసిన నేపథ్యంలో కక్ష పెంచుకున్న బుర్జుకాడి విజయ్ కుమార్ సహచరులతో కలిసి ఈనెల 11న అశోక్ కుమార్‌పై దాడి చేసి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌తో పాటు బుర్జుకాడి ఆంజనేయులు, బుర్జుకాడి లింగప్ప, కిచ్చి నగేష్, కిచ్చి వెంకటేష్, గంజి శరత్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్ వివరాలను వెల్లడించారు.
విజయ్‌కుమార్ కుటుంబం నుండి ప్రమాదం ఉందని పసిగట్టిన మృతుడు అశోక్ కుమార్ తన కుటుంబాన్ని స్వగ్రామం నారాయణపేట జిల్లాలోని అభంగాపూర్ నుండి హైదరాబాద్‌కు తరలించి, శత్రువులకు చిక్కకుండా వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండేవాడు. గత మూడు సంవత్సరాల క్రితం రాంపల్లిలో సొంత ఇళ్లు నిర్మించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్ అశోక్ కుమార్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. తన సహచరులు బుర్జుకాడి ఆంజనేయులు, బుర్జుకాడి లింగప్ప, కిచ్చి నగేష్, కిచ్చి వెంకటేష్‌లతో కలిసి అభంగాపూర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి నుండి నాలుగు వేట కొడవళ్లు సంపాదించారు. రెక్కీ నిర్వహించి అశోక్ కుమార్‌ను ఈనెల 5వ తేదీన ఒకసారి, 10 తేదీన రెండోసారి హత్య చేసే ందుకు ప్రయత్నించారు. మృతుడు ఆ రోజుల్లో ఇంటి నుండి బయటకు రాకపోవడంతో విఫలమయ్యారు.
ఈ నెల 11న సాయంత్రం 7.40 గంటల సమయం లో తమ ప్రణాళికను అమలు చేసి అశోక్ కుమార్ ఇంటి వద్ద అతన్ని నరికి చం పారు. తప్పించుకునే క్రమంలో కారులో పరారైన నిందితులు హయత్‌నగర్ మండలం తట్టి అన్నారం పరిధిలో రక్తంతో తడిసిన దుస్తులు, ఇతర సామాగ్రిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. వేట కొడవళ్లను సమీపంలోని పొదల్లో విసిరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కీసర పోలీసులు బృందాలుగా విడిపోయిన నిందితుల కోసం గాలించారు.విశ్వసనీయ సమాచరంతో వికారాబాద్‌లో నిందితులను అరెస్టు చేసి వారి నుం డి ఫోర్ట్ ఫియస్టా కారు, 4 వేట కొడవళ్లు, 5 సెల్ ఫోన్లు, దుస్తుల అవశేషాలు కలిగిన బూడిదను స్వాదీనం చేసుకున్నారు.
హత్య కేసును చేదించి నిందితులను అరెస్టు చేసిన కీసర పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త కమిషనర్ వి.సత్యనారాయణ, డీపీసీ జానకి ధరావత్ అభినందించా రు. విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి, ఎస్‌ఓటీ సీఐ, రాములు, సీఐ రఘువీర్‌రెడ్డి, డీఐ ఆర్.బబ్యానాయక్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.