Sunday, January 19, 2025

ఓఆర్ఆర్ పై ప్రమాదం..రియల్ వ్యాపారి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆదిభట : వేగంగా ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుటర్ రింగ్‌రోడ్డుపై ఎగ్జిట్ 12 ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక సిఐ రఘువీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు..సూర్యాపేట జిల్లా చింతాలెమ్ మండలం మల్లారెడ్డిగూడకు చె ందిన నర్సింహ్మరావు(35) విజయవాడలో ని వాసముంటూ వృత్తిరిత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పనుల నిమిత్తం శుక్రవారం తన వాహనంలో కోదాడకు చెందిన కారు డ్రైవర్ నారాయణ(36)తో కలసి నగరానికి చేరుకున్నాడు.

పనులు ముగించుకొని తిరిగి విజయవాడ వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం అవుటర్ రింగ్‌రోడ్డుపై బొంగ్లూర్ ఎగ్జిట్ 12 సమీపంలో కారు వేగంగా వెళ్తూ ముందువెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్క సీటులో కూర్చుని ఉన్న నరసింహారావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈఘటనలో డ్రైవర్‌కు సైతం గాయపడగా అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కాగా నరసింహారా వు మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మా ర్చురీకి తరలించినట్లు సిఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు జరు పుతు న్నట్లు సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News