Sunday, January 19, 2025

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఫరిధిలోని యూసుఫ్‌గూడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న(35) యూసుఫ్‌గూడలోని లక్ష్మినగర్‌లో ఉంటున్నాడు. నగరంలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు రాము ఇంటికి వచ్చారు.

ఒక్కసారిగా రాముపై పడి కత్తులతో మర్మాంగాలను కొసి వేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాని ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News