Monday, December 23, 2024

2047 నాటికి రూ.478 లక్షల కోట్లకు రియల్ ఎస్టేట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ రియల్ ఎస్టేట్ రంగం 2047 సంవత్సరం నాటికి 5.8 బిలియన్ డాలర్లకు (రూ.478.77 లక్షల కోట్లు) చేరుకోనుందని అంచనా. ఈమేరకు రియల్ ఎస్టేట్ ట్రేడర్స్ బాడీ నారెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2047 నాటికి 12 రెట్లు ఎక్కువ పెరిగి 5.8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.

గతేడాది ఈ సంఖ్య 4.77 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఆర్థిక ఉత్పత్తికి 15 శాతానికి పైగా దోహదపడుతుందని నారెడ్కో, నైట్‌ఫ్రాంక్ నివేదికలో పేర్కొన్నాయి. రియల్ ఎస్టేట్ ట్రేడర్స్ బాడీ నారెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం ‘ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం, భారత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఆర్థిక ఉత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 15.5 శాతానికి పెరగనుంది.

ప్రస్తుతం ఈ వాటా 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి రియల్ ఎస్టేట్ దోహదపడుతుందని నారెడ్కో ఇండియా ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ అన్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, డెమోగ్రాఫిక్ డివిడెండ్, వ్యాపారం, పెట్టుబడి సెంటిమెంట్‌లను మెరుగుపరచడం, ప్రభుత్వ విధానాలు రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతు ఇస్తాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News