Monday, December 23, 2024

మా సమస్యలను పరిష్కరించండి: రియల్ ఎస్టేట్ ప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి రియల్‌రంగం సభ్యులు సిఎస్ శాంతికుమారి విన్నవించారు. వాటిని తర్వగా పరిష్కరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు సిఎస్‌ను కోరారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. క్రెడాయ్, నారెడ్కో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, కమర్షియల్ ట్యాక్స్, కార్మిక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్‌లోని కొన్ని అంశాలు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని, కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించే వరకు మున్సిపల్ శాఖలో కమిటీ వేసి ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లోని ఆ అంశాలను మార్చాలని. ఇతర పరిశ్రమల మాదిరిగానే నిర్మాణ స్థలంలో తాత్కాలిక వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలని ప్రతినిధులు సూచించారు. భవన నిర్మాణ అనుమతితో పాటు టిఎస్ బిపాస్ కింద బోర్‌వెల్‌కు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా, భవన నిర్మాణానికి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కూడా టిఎస్ బిపాస్‌లోనే అవకాశం ఇవ్వాలని వారు కోరారు.
టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలి
దరఖాస్తుదారులు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించడానికి జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ కార్యాలయాలలో టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరారు. సాధారణ సిస్టం వైఫల్యాన్ని నివారించడానికి ప్రస్తుత, భవిష్యత్ సిస్టంలకు అనుగుణంగా టిఎస్ బిపాస్‌లో ఇప్పటికే ఉన్న ఐటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని వారు కోరారు. తనఖా నమోదు, నీటిపారుదల శాఖ ద్వారా హెచ్‌ఎండిఏ పరిధిలోని వివిధ చెరువుల రీసర్వే తదితర అంశాలను కూడా ఈ సమావేశంలో రియల్‌ఎస్టేట్ ప్రతినిధులు ప్రస్తావించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని సిఎస్ తెలిపారు. రాష్ట్రంలో మంచి పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి బిల్డర్ల సోదరభావంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆమె సూచించారు. రియల్ ఎస్టేట్ రంగం తన వ్యాపారాన్ని సజావుగా నిర్వహించేలా చూడటమే ప్రభుత్వ ప్రయత్నమని ఆమె తెలిపారు. పరిశ్రమకు అనుమతులు త్వరితగతిన పొందేందుకు ప్రభుత్వం టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్ వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు.
విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం: అరవింద్ కుమార్
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలియజేశారు. టిఎస్ రెరా చైర్మన్ డా.ఎన్.సత్యనారాయణ, సిసిఎల్‌ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వాటర్ వర్క్ ఎండి దానకిషోర్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News