Wednesday, January 22, 2025

ఆండ్రాయిడ్ 14తో రియల్‌మి 12 ప్రొ సిరీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రియల్‌మి 12 ప్రొ 5జి, రియల్‌మి 12 ప్రొ ప్లస్ 5జి పేరిట రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రియల్‌మి విడుదల చేసింది. ఫిబ్రవరి 6 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. రియల్‌మి ఇండియా ప్రొడక్ట్ మేనేజర్ బజుల్ కొచ్చార్ ఈ ఫోన్ల ఫీచర్లను వివరిస్తూ, ఈ రెండు ఫోన్‌లలో కంపెనీ సోనీ ఐఎంఎక్స్ 882, సోనీ ఐఎంఎక్స్ 890 కెమెరా సెన్సార్‌లను ఉపయోగించగా, రియల్‌మి 12 ప్రొ ప్లస్‌లో కంపెనీ 64ఎంపి టెలిఫోటో లెన్స్‌ను అందించిందన్నారు. ఇది 3 రెట్లు జూమ్ మద్దతుతో వస్తుంది.

అదే 50ఎంపి కెమెరా సెటప్ రియల్‌మి 12 ప్రొ 5జిలో ఇచ్చింది. ఫోన్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67డబ్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మొదటి మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వస్తుంది, దీని ధర రూ.25,999గా ఉంది. రియల్‌మి 12 ప్రొ ప్లస్ ఫోన్ మొదటి మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ నిల్వతో వస్తుంది, దీని ధర రూ.29,999గా ఉంది. ఫోన్ రెండో మోడల్ 8జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్‌తో వస్తుంది, దీని ధర రూ.31,999గా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News