Sunday, January 19, 2025

భారత్ మార్కెట్లో రియల్‌మీ 13 ప్రో సీరీస్ ఫోన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఠఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన రియల్‌మీ 13 ప్రో సీరీస్ 5జి ఫోన్లను ఈ నెల 30న భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. బోస్టన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సహకారంతో ఈ ఫోన్లు రూపుదిద్దుకున్నాయి. ఈ ఫోన్ 6.7 అంగుళాల (1080/2412 పిక్సెల్స్) అమెలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 2.4 గిగా హెర్ట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. 16 జిబి ర్యామ్‌తో పాటు ఒక టిగా బైట్ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందని చెబుతున్నారు. ట్రిపుల్ రియర్ కెమెరాసెటప్‌తో వస్తుందని తెలుస్తోంది.

50 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రియల్‌మీ 13 ప్రో + ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అందులో 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటి 701 సెన్సర్ విత్ ఒఐఎస్, 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటి 600 సెన్సర్ విత్ 3 ఎక్స్ జూమ్ కెమెరాలతో వస్తోంది. రియల్‌మీ 13 ప్రో+, రియల్‌మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్ ఆప్షన్లతో వస్తున్నాయి. ఎఐ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, ఎఐ స్మార్ట్ రిమూవల్, ఎఐ అల్ట్రా క్లారిటీ వంటి పలు ఎఐ ఫీచర్లతో ఈ రెండు ఫోన్లు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News