Wednesday, December 18, 2024

రియల్‌మి నార్జో 70 ప్రో లాంచ్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి సరికొత్త హ్యాండ్‌సెట్ రియల్‌మి నార్జో 70 ప్రొ 5జిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 120 హెట్జ్ అల్ట్రా స్మూత్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 67 డబ్లు సూపర్ విఒఒసి, 5000 ఎంఎహెచ్ పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లను కల్గివుంది. ఎయిర్ గెస్చర్ ఫీచర్, 3 డి కూలింగ్ సిస్టమ్‌తో ఉంటుంది. రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి విభాగంలో మొదటి హారిజన్ గ్లాస్ డిజైన్‌ని మెరుగుపరుస్తుంది. అది గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్ రంగులలో లభ్యమవుతుంది.

రెండు స్టోరేజ్ వేరియంట్లు రూ.19,999 కు 8జిబి+128జిబి, రూ.21,999 కు 8జిబి+256జిబి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 19న సేల్స్ ప్రారంభం కాగా, మార్చి 22 మధ్యాహ్నం 12 నుంచి లైవ్ కమర్షియల్ అమ్మకం రియల్‌మి.కామ్, అమెజాన్‌లో మొదలవుతుంది. కొనుగోలుదారులు రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి (8జిబి+128జిబి) మీద రూ.1000 తగ్గింపును
బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News