Monday, December 23, 2024

రియల్‌మీ ప్యాడ్ 2, సి53 ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రియల్‌మి సరికొత్త సి53, రియల్‌మి ప్యాడ్2 మోడళ్లను విడుదల చేసింది. రియల్‌మి సి53 ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్ 108 ఎంపి కెమెరా లెన్స్ కల్గివుంటుంది. రియల్‌మి ప్యాడ్ 2 డిస్‌ప్లే విషయానికొస్తే 120హెచ్‌జెడ్ 2కేను కల్గివుంటుంది. రియల్‌మి సి53 రెండు వేరియంట్లలో వస్తోంది. ఇది 4జిబి+ 128జిబి ధర రూ.9,999, అలాగే 6జిబి+ 64జిబి ధర రూ.10,999గా ఉంది. రియల్‌మి ఐపాడ్ 6జిబి+ 128జిబి ధర రూ.19,999, 8జిబి+ 256జిబి రూ.22,999గా ఉంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, అత్యాధునిక ఫీచర్లు, లీప్-ఫార్వర్డ్ సాంకేతిక పురోగతి, శక్తివంతమైన పనితీరుతోఈ ఉత్పత్తులు విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఉత్పత్తులు రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News