హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరుకు చెందిన రియల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల సమక్షంలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, కాకిరాల హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన గులాబీ గూటికి చేరారు. ఆయనకు గులాబీ కండువాను కప్పి మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తొర్రూరు అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ఎర్రబెల్లి కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 25 లక్షలు, మంత్రి కెటిఆర్ లు రూ.25 లక్షలు ప్రత్యేకంగా ఇచ్చారన్నారు. మున్సిపాలిటీగా, డివిజన్ కేంద్రంగా తొర్రూరు అప్రతిహతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. బిఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై, ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న తాను పార్టీలో చేరుతున్నానన్నారు. రాజేందర్ కు పార్టీలో మంచి గుర్తింపును ఇస్తామని మంత్రులు వెల్లడించారు.