మన తెలంగాణ/కీసర: పాత కక్షలతో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నారాయణపేటకు చెందిన అశోక్ కుమార్ (50)గత కొంత కాలంగా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చే స్తున్నాడు. గురువారం రాత్రి నంబర్ ప్లేట్ లేని ఫోర్డ్ కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అశోక్ కుమా ర్ ఇంటి వద్ద ఇనుప రాడ్‌లు, కత్తులతో అతనిపై దాడి చేశారు. స్థానికంగా ఉన్న వారు కేకలు వే యడంతో హంతకులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అశోక్ కుమార్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డిసిపి జానకి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.నారాయణపేటకు చెందిన వ్యక్తులు పాత కక్షలతో అశోక్ కుమార్‌నుహత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 2019లో అశోక్ కు మార్‌పై హత్యాయత్నం జరుగగా నిందితులపై మర్కల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.