Sunday, December 22, 2024

మాదాపూర్‌లో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

Realtor Hulchul with gun in Madhapur

గన్‌తో హల్‌చల్ చేసిన రియల్టర్
భూవివాదమే కారణం
అరెస్టు చేసిన మాదాపూర్ పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : రియల్టర్ గన్‌తో హల్‌చల్ చేయడంతో మాదాపూర్‌లో గురువారం రాత్రి కలకం రేగింది. పోలీసుల కథనం ప్రకారం…సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్‌బాబుకు ఖానమెట్, చందానాయక్ తండాలో ఉన్న స్థలంలో నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనుల కాంట్రాక్టును సంజీవరెడ్డి తీసుకున్నాడు. భూమి విషయమై సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి మధ్య వివాదం చోటుచేసుకుంది. తన భూమిలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. దీంతో సురేష్ బాబు సూపర్‌వైజర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి గురువారం మరోసారి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి, సంజీవరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన సంజీవరెడ్డి తన గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదింరించాడు. దీంతో రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News