Wednesday, January 8, 2025

ఐటి రిఫండ్ ఆలస్యానికి కారణాలివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆదాయం పన్ను రిటర్న్ గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ గడువు లోగా ఐటిఆర్ దాఖలు చేయని పక్షంలో పన్ను చెల్లింపుదారులు జరిమానా వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను శాఖ ప్రకారం, ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటి రిటర్న్‌లను దాఖలు చేశారు. జూలై 31 తేదీ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో యూజర్లు ఐటిఆర్ ఫైలింగ్ గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగస్టు 1 నుంచి ఐటిఆర్ ఫైల్ చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను బాధ్యత ఉండి కూడా టాక్స్ చెల్లించని వారికి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావొచ్చు. ఇప్పటికే ఐటి రిటర్న్ దాఖలు చేసిన రిఫండ్ కోసం వేచిచూస్తున్నారా? రిఫండ్ చాలా ఆలస్యం అవుతోందా? ఆలస్యానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

బ్యాంక్ ఖాతా
సిఎ అభయ్ శర్మ (మాజీ ప్రెసిడెంట్ ఇండోర్ చార్టర్డ్ అకౌంటెంట్ బ్రాంచ్) మాట్లాడుతూ, ఇటీవల చాలా బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అయ్యాయి, దీంతో వాటి ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌లు మారాయి. పన్ను చెల్లింపుదారులు బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఐటి శాఖతో అప్‌డేట్ చేయకుంటే రీఫండ్ నిలిచిపోవచ్చు. మీరు www.incometax.gov.inని సందర్శించడం ద్వారా రీఫండ్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

బ్యాంక్ ఖాతా ముందుగా ధృవీకరణ
ఆదాయపు పన్ను రీఫండ్‌ను స్వీకరించాల్సిన బ్యాంక్ ఖాతాను ముందుగా ధృవీకరించండి పొందండి. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ఫైల్ చేసిన తర్వాత మీకు ఏదైనా రీఫండ్ ఉంటే, మీరు దాయపు పన్ను శాఖకు చెందిన సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ( సిపిసి) ద్వారా పొందుతారు. దీని కోసం రీఫండ్ పొందడంలో జాప్యం జరగకుండా ఉండటానికి, బ్యాంక్ ఖాతా ముందుగా ధృవీకరించుకోవాలి.

రిటర్న్‌ను వెరిఫై చేయకపోతే
సమయానికి రిటర్న్‌ను దాఖలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఐటీఆర్‌ను ధృవీకరించే వరకు మీ వాపసు ప్రాసెస్ కాదు. అంటే దాఖలు చేసిన ఐటిఆర్‌ని ధృవీకరించడం అవసరం, రిటర్న్ పొందడంలో జాప్యానికి ఇది కూడా కారణం కావచ్చు.

ఐటి ఇమెయిల్‌కు స్పందించకపోవడం
సిఎ అభయ్ శర్మ ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ పంపిన ఇమెయిల్‌కు స్పందించకపోవడం వల్ల కూడా వాపసు నిలిచిపోతుంది. ఆదాయపు పన్ను శాఖ పంపిన ఇ-మెయిల్‌లో పన్ను చెల్లింపుదారుల నుండి వారి బకాయి ఉన్న డిమాండ్, వారి బ్యాంక్ ఖాతా, వాపసులో ఏదైనా తేడా ఉంటే సమాచారం కోరతారు. ఈ సమాచారాన్ని సకాలంలో అందించకపోతే మీ రిటర్న్ నిలిచిపోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News