Saturday, November 23, 2024

అనవసరంగా కోపం వస్తుందా? అయితే కారణాలు ఇవే!

- Advertisement -
- Advertisement -

ఎవరికైన కోపం రావడం సహజం. మానవ స్వభావంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా ఏదైనా అతని మార్గంలో జరగనప్పుడు కోపం వస్తుంది. కానీ, చాలా సార్లు ఏ కారణం లేకుండా కూడా కోపం వస్తుంది. చివరికి మనకు ప్రియమైనవారిపై కూడా కోపం వస్తుంది. ఈ క్రమంలో కింది కారణాలవల్ల కూడా కోపం రావొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం.

1. పని గురించి ఒత్తిడికి గురవుతుంటే లేదా చిన్న విషయాలపై విసుగు చెందడం ప్రారంభించినట్లయితే, కోపం రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో ప్రియమైన వారిపై లేదా చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు.

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. టెస్టోస్టెరాన్ హార్మోన్‌లో హెచ్చుతగ్గులు ఉద్రేకపూరిత స్వభావం, దూకుడు, చిరాకును పెంచుతాయి. ముఖ్యంగా.. మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అసమతుల్యత పీరియడ్స్ సమయంలో సంభవిస్తుంది.

3. ఆల్కహాల్, పొగాకు లేదా మరేదైనా మత్తు పదార్థాలను తీసుకుంటే, అది మనిషికి కోపం తెపిస్తుంది. ఇది గృహ హింస, సామాజిక ఆందోళనను కూడా పెంచుతుంది.

4. ఒక నివేదిక ప్రకారం.. బాల్యంలో గృహ హింస, దుర్వినియోగం, ప్రతికూల వాతావరణంలో పెరిగే పిల్లలు పెద్దయ్యాక కోపం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలను ఎల్లప్పుడూ సానుకూల, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచాలి.

కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి?

పైన పేర్కొన్న విధంగా అనేక కారణాలవల్ల కోపం రావొచ్చు. ఒకవేళ చిన్న విషయాలకే ఎక్కువగా కోపం వస్తే, దీనికి ఉత్తమ పరిష్కారం ధ్యానం. మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది. యోగా, ధ్యానం చేస్తే మరింత ప్రశాంతత లభిస్తుంది. దీంతో కోపం ధోరణి కూడా క్రమంగా తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News