Monday, December 23, 2024

అంగారక గ్రహం పొడిబారడానికి కారణాలు

- Advertisement -
- Advertisement -

అంగారక లేదా కుజగ్రహంపై అరుణ వర్ణంతో ఎడారిలా ఇసుక తిన్నెలతో కనిపిస్తుంటుంది. కానీ నీటి వనరులు ఒకప్పుడు ఉండేవనడానికి ఆనవాలుగా నీటి జాడలు కనిపిస్తుంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిత ఈ గ్రహంపై వెచ్చదనంతోపాటు తడి కూడా ఉండేదని, రానురాను అక్కడ వాతావరణం పొడిగా మారిందని చికాగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒకప్పుడు గ్రహంపై నదులు, సరస్సులు ఉండేవనడానికి సాక్షంగా వాటి అవశేషాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 3 నుంచి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం నదులకు, సరస్సులకు అనుకూలమైన వెచ్చని వాతావరణం ఉండేదని, ప్రస్తుతం ద్రవ రూపంలో నీటి ఉనికి ఉండేందుకు అనువైన అతిశీతల , తేలికపాటి వాతావరణం నెలకొందని, చికాగో యూనివర్శిటీ జియో ఫిజికల్ శాస్త్రవేత్త ఎడ్విన్ కైట్ పేర్కొన్నారు.

నివాస యోగ్యం నుంచి నివసించడానికి వీలులేనిదిగా మారిన గ్రహం ఇదొక్కటే అయినందున తాము ఈ గ్రహ వాతావరణాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాతావరణంలో కార్బన్‌డై యాక్సైడ్ కోల్పోవడమే అంగారక గ్రహం ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని చాలా మంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నా ఆ సిద్ధాంతాన్ని కైట్ బృందం పూర్తిగా బలపరచడం లేదు.

నదుల ఉనికికి కార్బనేతర వనరుల నుంచి వేడిమి అవసరమని కైట్ చెబుతున్నారు. ఈ గ్రహంపై ఇదివరకు ఎత్తైన పర్వతాలు ఉండేవని, కానీ తరువాతి దశల్లో నదులు ఏర్పడేందుకు వీలుగా అవి మారాయని కైట్ ఇదివరకటి విశ్లేషణ వెల్లడించింది. హరిత వాయువుల ప్రభావానికి వాతావరణ మార్పులకు సంబంధం ఉందని, గ్రహ వాతావరణ శాస్త్రవేత్త బొవెన్ ఫాన్ చెప్పారు. శాటిలైట్ ఇమేజిల ద్వారా ఈ గ్రహంపై నదుల ఉనికి, వాటి మార్పును విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News