మనతెలంగాణ/హైదరరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల ఆధారంగా నిర్మించిన పాలమూరురంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన వ్యయానికి ఆర్ధికంగా చేయూత అందిస్తామని కేం ద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గురువారం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రనీటిపారుదల రంగానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు.
పాలమూరురంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇచ్చి ఆదుకోవాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి షెకావత్‌కు విజ్ణప్తి చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగే మే లును వివరించారు. కృష్ణానదీజలాల నుంచి 90టీఎంసీలను ఉపయోగించి రాష్ట్రంలో అత్యల్పవర్షపాత ప్రాం తమైన దక్షిణ తెలంగాణలో కరువు పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్లగొండ జిలలాల్లో వందలాది గ్రామాలకు తాగునీటితోపాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందజేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు వివరించారు. ఆరు జిల్లాల పరిధిలో 1226గ్రామాలతోపాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాల చేయాల్సివుంటుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి న పర్యావరణ, అటవీశాఖల అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి లభించాల్సిన క్లియరెన్సులు తదితర అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు.
హైడ్రాలజి, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బిజి రేషియో, అంతర్‌రాష్ట్ర అంశాలు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఇందుకు సంబంధించిన వినతిపత్రం అందజేశారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశపు వివరాలను మీడియాకు వెల్లడించారు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరినట్టు తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేమని , అయితే అందుకు బదులుగా ఇతర పధకాల కింద ఆర్ధికంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో కృష్ణానదీ నుంచి 90టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యంగా తెలిపారు. దీనికి కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు కూడా కోరామని వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టుకు తప్పకుండా సాయం అందిస్తామన్నారని , 2014తర్వాత జాతీయ హోదా పథకం వటి అవకాశాలు ఇప్పుడు కేంద్రంలో లేనందున ప్రత్యామ్నాయంగా వేరే పథకం కింద సహాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.