Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తో ప్రజలకు భరోసా

- Advertisement -
- Advertisement -

గొల్లపల్లి: భారతీయ రాష్ట్ర సమితి ప్రజలకు భరోసానిస్తోందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉన్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం మంత్రి ఈశ్వర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ పార్టీతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే ప్రజలంతా బిఆర్‌ఎస్ వెంట నడుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గ్రామాలు అభివృద్ది చెందాయని, ప్రజల ఆకాంక్ష మేరకు తాము పాలన సాగిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అందరికీ సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని, సబ్బండ వర్గాలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి, భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా సిఎం కెసిఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల పేరిట రెండు లక్షల రూపాయల బీమా చేయిస్తున్నామని, ప్రమాదవశాత్తు కార్యకర్త చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల పరిహారం అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు.

తెలంగాణలో అమలవుతున్న నెలకు రూ. 2 వేల ఫించన్, వికలాంగులకు 4 వేలు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు అందిస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని కోరారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ఇంటింటికి వివరించాలని, పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఎల్. రమణ, జెడ్‌పిటిసి గోస్కుల జలెంధర్, ఎంపిపి నక్క శంకర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఆవుల సత్యం, ప్యాక్స్ చైర్మన్ మాధవరావు, నాయకులు పడాల జలెంధర్, గురిజెల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News