Monday, December 23, 2024

ఆ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్.  రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్…ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటారు. అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలాకాలమవుతోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ కనిపించింది. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్.

ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ట్విట్టర్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అనుకోవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్ తో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్ వంటి బిగ్ టికెట్ మూవీస్ తో త్వరలో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News