Wednesday, January 22, 2025

మయన్మార్‌లో ఎయిర్‌పోర్టు రెబెల్స్ కైవసం

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: మయన్మార్‌లో రాఖైన్ మైనార్టీ తెగల రెబెల్ సైన్యం సైనిక ప్రభుత్వంపై తిరుగుబాటులో తమ పట్టు బిగించింది. తాము దేశంలోని అత్యంత కీలకమైన రిసార్ట్ ప్రాంతపు తాండ్వే ఎయిర్‌పోర్టు (దీనినే మా జిన్ ఎయిర్‌పోర్టు అని కూడా అంటారు)ను స్వాధీనపర్చుకున్నట్లు ఈ వర్గం ప్రకటించింది.

తమకు ప్రత్యేక ప్రాంతం ఏర్పాటు కోసం ఈ తెగ చాలా కాలంగా మయన్మార్ సైనిక ప్రభుత్వంతో పోరాడుతోంది. ఇప్పుడు తమకు భారీ విజయం దక్కినట్లు ఈ రెబెల్స్ సోమవారం తెలిపారు. ఈ ప్రాంతం వారు కూడా ఈ ఎయిర్‌పోర్టు స్వాధీనాన్ని ధృవీకరించారు. ఈ రెబెల్ సైన్యాన్ని అరకాన్ ఆర్మీగా వ్యవహరిస్తారు. ఈ సైన్యం స్థానిక బౌద్ధ రాఖైన్ మైనార్టీ వర్గానికి అనుబంధంగా ఉంది. సైనిక ప్రభుత్వంతో తలపడుతోంది.

దేశంలో ఎన్నికల ద్వారా ఏర్పాటు అయిన అంగ్ సాన్ సూకి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం తమ జుంటాను నెలకొల్పిన తరువాత ఈ వర్గం నుంచి తొలిసారిగా గట్టి దెబ్బతిందని వెల్లడైంది. సైన్యంతో జరిపిన ఘర్షణలో ఎయిర్‌పోర్టును కైవసం చేసుకున్నట్లు. ఈ ప్రాంతంలో 400కు పైగా సైనికుల మృతదేహాలను, ఆయుధాలను కనుగొన్నట్లు ఈ రెబెల్ వర్గాలు తెలిపాయి. ఈ గ్రూప్ ప్రకటనను అంతర్జాతీయ వార్తా సంస్థలు ధృవీకరించలేదు. కాగా సైనిక జుంటాకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక మిలిటెంట్లు, వివిధ గెరిల్లా బృందాలు పలు మైనార్టీ తెగలకు అనుసంధానం అయ్యి పనిచేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News