Thursday, January 23, 2025

ఉచిత లైసెన్స్ మేళాలో దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్నది గమనించి రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు శ్రీకారం చుట్టారని సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రారంభించి యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. బిఆర్‌ఎస్ నాయకుడు చింత సాయినాథ్ మాట్లాడుతూ లైసెన్సుల జారీ ఖర్చును చింత ప్రభాకర్ సొంత నిధులతో భరిస్తారని తెలిపారు.స్లాట్ బుక్ చేయించి లర్నింగ్ లైసెన్స్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నరహరిరెడ్డి, మాజి సిడిసి చైర్మన్ విజేందర్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మనోహర్‌గౌడ్, నాయకులు నక్క నాగారాజు గౌడ్, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి,పట్టణఅధ్యక్షుడు వెంకటేశ్వర్లు కౌన్సిలర్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News