Monday, December 23, 2024

ప్రపంచంలో మూడింట ఒక వంతుకు ఆర్థికమాంద్యం?

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఈ ఏడాది ఆర్థికమాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూడింట ఒక వంతు మేరకు దెబ్బతీయగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే 2023వ సంవత్సరం మరింత దుర్భరంగా ఉండగలదని ఆమె అన్నారు. అమెరికా, యూరొపియన్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు చాలా మందగించాయన్నారు. ఆదివారం సిబిఎస్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ఫేస్ ద నేషన్’లో ఆమె ఈ బాధాకర విషయాలు చెప్పారు.

పది నెలలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని సమయంలో ఈ ఆర్థిక మాంద్యం వస్తోందన్నారు. అత్యధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా సంక్రమణలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయన్నారు.‘ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనున్నది’ అని జార్జివా ఆ న్యూస్ ప్రోగ్రామ్‌లో అన్నారు. అమెరికా, యూరొప్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు మందకొడి కావడంతో 2023వ సంవత్సరం మరింత దుర్భరంగా ఉండనున్నదని క్రిస్టాలినా జార్జివా తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News