Monday, December 23, 2024

బాలుడిని బలితీసుకున్న మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇంద్రప్రస్థ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సైక్లింగ్ చేస్తున్న 13 ఏళ్ల బాలుడిని మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న బైక్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలై బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు సాయి శ్రీశాంత్ రెడ్డి మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మి ఇద్దరు న్యూజిలాండ్ సిటిజన్స్. ఇటివలే చదువుకునేందుకు బాలుడు న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News