Monday, January 20, 2025

అంకిత భావంతో సేవ చేస్తేనే సమాజంలో గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించినప్పుడే ఉద్యోగి ప్రతిభ తెలుస్తుందని.. ప్రతీ ఉద్యోగి తనలో ఉన్న ప్రతిభకు విజ్ఙానాన్ని కూడా జోడించి ప్రజలకు సేవలు అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంపొందుతుందని జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. శనివారం ఐ.డి.ఓ.సిలోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని రెవెన్యూ, స్థానిక సంస్థలు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే బాద్యత అన్ని శాఖల అధికారులు, సిబ్బందిపై ఉంటుందన్నారు. వారు ప్రజలకు అందించే సేవల అధారంగానే ప్రభుత్వానికి కూడా మంచి, చెడు పేరు వస్తాయన్న విషయాన్ని మరవరాదని పేర్కోన్నారు.

జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి తాను అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలందిస్తూ తన ప్రగతి బాటలు వేసుకోవాలన్నారు. ఉద్యోగంలో చేరిన్పుడే ఒక లక్షంతో పనిచేయాలని నిర్ధేశించుకుంటామని ఆలక్ష్యాల మేరకు కృషి చేస్తూ సాధించిన అనుభవాన్ని జోడించి ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. ఎదుటివారి ఎదుగుదల కోరుకున్నప్పుడే అందులో మన ప్రగతి కూడా ముడిపడి ఉంటుందన్నారు. అందుకే ప్రభుత్వం అందించే సేవలకు ఒక నిర్ధ్దిష్ట సమయాన్ని కేటాయించిందని గడువులోగా పనులు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసి జవాబుదారితనాన్ని పెంచిందని కలెక్టర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడడమే కాకుండా దేశంలో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానాన్ని పొందింది అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు ప్రజలు వచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా ఓపికగా సమాధానం చేప్పడం నేర్చుకోవాలన్నారు. ప్రజలతో సంబంధాలు నెలకొల్పుకుంటూ ముందుకు పోవాలని అప్పుడే మనపై ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు. అందుకే తెలంగాణను దాశరథి కీర్తిస్తూ చెప్పిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కలెక్టర్ గుర్తు చేశారు.

జిల్లా పరిషత్ చైర్మైన్ కుమారి అంగోతు బిందు మాట్లాడుతూ.. తొమ్మిది మండలాలుగా ఉన్న మానుకోట 16 మండలాలతో నూతన జిల్లాగా ఏర్పడి సుపరిపాలన అందించేందుకు మరో రెండు మండలాలను కూడా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలనే కార్యాలయాన్నింటిని సమీకృత అధికారుల భవన సముదాయం పేరిట ఒకే చోట నిర్మించి ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గౌరవం దక్కినట్లు అయ్యిందన్నారు. మనది అనే భావన కలిగిందన్నారు. ప్రజా సేవలలో అధికారులు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు దేశానినే వన్నె తెచ్చిందన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. అధికారులు అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు. జవాబుదారితనం పెంపొందించుకుంటూ ఆదర్శంగా పనిచేస్తే విలువలతో పాటు సమాజంలో తగిన గుర్తింపు వస్తోందన్నారు. జిల్లా ఏర్పాటు అయ్యాక ఉద్యోగాలలో ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్లను పది శాతం పెంచుకున్నామన్నారు.

నిజం చెరువు అభివృద్దితో తన కల సాకారంచేసుకుంటానన్నారు. ఉద్యోగుల్లో ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల పెంపిందించుకోని సమాజంలో మంచి ఉద్యోగిగా గుర్తింపు పొందాలన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు వంద పడకల ఏరియా ఆస్పత్రిని 320 పడకలతో కూడిన జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసుకుని పేద వర్గాలకు సర్కారు వైద్యాన్ని చేరువ చేసుకోగలిగామన్నారు. నర్సింగ్ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఏ పనైనా ఏ వర్గం వారైనా మనసుపెట్టి పనిచేయాలన్నారు. అందులో నేను సాధించగలననే నమ్మకం కసిగా కనిపించాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లాలో చాప్ల తండా, మల్యాల ఇస్లావత్ తండా సర్పంచులు సాధించిన విజయాలను ఆయన వివరించారు. అందుకు తోడ్పాటుఅందించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, పాఠశాలల అభివృద్ధ్ది, రోడ్ల పురోగతి, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు అన్ని రకాల గ్రామాభివృద్ధి పనులు అధికారులు, సిబ్బంది తోడ్పాటుతోనే సాధ్యం అయ్యాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీ జోగుల చెన్నయ్య, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్. ఎం.డేవిడ్, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News