Monday, December 23, 2024

పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు

- Advertisement -
- Advertisement -

సంంగెం: పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు చెవ్వ బాలకృష్ణ, ఊకల్ గ్రామ సొసైటీ డైరెక్టర్ చెవ్వ పాపయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గండ్రకోటి రవి, చెవ్వ సారమ్మ, చెవ్వ కోమల, గండ్రకోటి రమ తదితరులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే నివాసంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ఎదురులేని శక్తి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నట్లు గమనిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు.ప్రతీ కార్యకర్తను కంటి రెప్పలా కాపాడుకుంటానన్నారు. పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, జడ్పిటిసి సుదర్శన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండ లాధ్యక్షుడు సారంగపాణి, వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్య క్షుడు సాగర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర హరి, కుమారస్వామి, అశోక్, వీరేశం, మొగిలి, ప్రతాప్, పురు షోత్తంరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తది తరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News