Monday, December 23, 2024

దేశంలో 40 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసి) నిర్దేశించిన ప్రమాణాలు పాటించని కారణంగా గడచిన రెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 40 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, పంజాబ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని మరో 100 వైద్య కళాశాలలు కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కోనున్నట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి.
నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా సిసిటివి కెమెరాల ఏర్పాటు, ఆధార్ సంబంధిత బయోమెట్రిక్ హాజరు, ఫ్యాకల్టీ నియామకాలు తదితర అంశాలలో చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఆయా కళాశాలలు గుర్తింపును కోల్పోయినట్లు అధికార వర్గాలు వివరించాయి. 2014 నుంచి దేశవ్యాప్తంగా వైద్య కళాశాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
2014కు ముందు దేశవ్యాప్తంగా 387 వైద్య కళాశాలలు ఉండగా ప్రస్తుతం అవి 763కు చేరుకున్నాయి. వైద్య కళాశాలల సంఖ్యలో 69 శాతం పెరుగుదల ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఫిబ్రవరిలో రాజ్యసభలో తెలిపారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా 51,348 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా ఇప్పుడు అవి 99,763కి చరుకున్నాయి. ఇందులో దాదాపు 94 శాతం పెంపు ఉంది. అదేవిధంగా వైద్య విద్యలో పిజి సీట్ల సంఖ్య 2014లో 31,185 నుంచి ఇప్పుడు 64,459కి పెరిగింది. ఇందులో 107 శాతం పెరుగుదల ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News