Monday, December 23, 2024

అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించండి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: గడిచిన 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ చీఫ్‌గా, మంత్రిగా తాను ఈ ప్రాంత అభివృద్దికి ఏం చేశానో ప్రతి ఒక్కరికి తెలుసునని అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించాలని మంచి వైపు నిలబడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దొంగతుర్తిలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ గత 60 ఏళ్లలో ఈ ప్రాంతానికి ఏమీ అభివృద్ధి జరిగిందో, గడిచిన తొమ్మిదన్నర ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం ఎంత పరుగులు పెట్టిందో ప్రతి ఒక్కరు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. నిద్రాహారాలు మాని ప్రజా సంక్షేమమే లక్షంగా, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ నిరంతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, తాను ఏమీ చేశానో సంక్షేమ ఏ విధంగా ముందుకు వెల్లిందో ప్రతి ఒక్కరు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్ ప్రతి కార్యకర్త ఇప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా ఉండి ఓ సైనికుడిలా పని చేశారని, భవిష్యత్‌లో అదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త, నాయకులకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానని మంత్రి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండి పని చేసి బీఆర్‌ఎస్ విజయంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లా సహకార సంఘాల చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్‌చైర్మన్ చొప్పరి చంద్రయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, మండల రైతుబంధు అధ్యక్షుడు పాకాల రాజన్న గౌడ్, జిల్లా రైతుబంధు సభ్యుడు పూసుకూరు రామారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, దొంగతుర్తి సర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ఎంపీటీసీ దాడి సదయ్య, ఉపసర్పంచ్ మూదం శ్రావణ్ కుమార్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలసాని లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News