Sunday, December 22, 2024

మండుతున్న ఎండలు

- Advertisement -
- Advertisement -
Record 40 degree highs across Telangana
ఆదిలాబాద్ జిల్లా చాప్రాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీల పైచిలుకు నమోదు
ఈసారి 450 నుంచి 520 మండలాల్లో వడగాల్పులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా 10 సంవత్సరాల్లో మార్చి నెలకు సంబంధించిన ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి కేరళ వరకు వీచే గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్నందున ఎండల వేడి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. గత పదేళ్లలో అత్యధికంగా 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, ఆదిలాబాద్‌లో 2017 మార్చి 31వ తేదీన 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మార్చి నెలలోనే 43 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రత చేరడంతో ఇక ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తులో

ప్రస్తుతం మంగళవారం అన్ని జిల్లాలో 40పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణంకన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. అన్ని జిల్లాలో ఎండ తీవ్రత, ఉక్కపోతలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో తక్కువ నీరున్న చోట ఎండుతున్న పంటలకు నీరందించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

గత సంవత్సరం 500 మండలాల్లో….

గత సంవత్సరం రాష్ట్రంలోని 589 మండలాలకు గాను 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మ్మెంట్ అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు నివేదికను రూపొందించాయి. ఆ నివేదిక ఆధారంగా సుమారుగా 500 మండలాల్లో అధికంగా వడగాల్పులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా 450 నుంచి 520 మండలాల్లో అధికంగా వడగాల్పులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News