Monday, December 23, 2024

సమాజానికి ఉపయోగపడే మంచి కథ

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్‌ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, నటుడు నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘ఈ రికార్డ్ బ్రేక్ సినిమాతో ఎంతోమందిని ఇండస్ట్రీస్ పరిచయం చేస్తున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నా 5 ఏళ్ల నుంచి ఇప్పటివరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సమాజానికికి ఉపయోగపడాలని అనుకొని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటీవల కొంతమంది నాతోటి దర్శకులు ఈ సినిమా చూసినవారు రికార్డ్ బ్రేక్ అనేది కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ అద్భుతాలు సృష్టిస్తుంది. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్‌గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News