Monday, December 23, 2024

విద్యుత్ వినియోగంలో రికార్డు..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగ డిమాండ్ భారీగా పెరిగింది. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలలోని రైతన్నలు వరి నాట్లను ముందస్తుగానే వేయడంతోనే డిసెంబర్ నెలలోనే ఈ స్థాయిలో విద్యుత్ వినియోగ డిమాండ్ ఉందని విద్యుత్ శాఖ అధికార వర్గాలు చెబుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిసెంబర్ నెలలో అత్యధికంగా 13403 మెగావాట్ల పీక్ డిమాండ్ నెలకొనడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే నిన్న మంగళవారం ఉదయం 8.00 గంటల ప్రాంతంలోనే 13403 మెగావాట్ల డిమాండ్ నమోదైందని అధికారులు తెలియజేస్తున్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తుండడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం ఒక్కసారిగా పెరిగింది.

దీంతో ఇతర రంగాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయ రంగానికే విద్యుత్ వినియోగం అధికంగా పెరిగిందంటున్నారు. గతంలో ఫిబ్రవరి నెలలో విద్యుత్ వినియోగ డిమాండ్ పెరిగేదని, కానీ ఈ సారి మాత్రం మరీ ఇంత ముందస్తుగానే రైతన్నలు వరి నాట్లు వేయడంతో డిసెంబర్ నెలలోనే ఇంత విద్యుత్ వినియోగ డిమాండ్ వచ్చిందని విద్యుత్ అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిసెంబర్ నెలలోనే విద్యుత్ వినియోగం డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. కాగా ఈ సారి వేసవి కాలంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని, అయినా గానీ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

నీటికి కొరత లేనందుకే..

తెలంగాణలో నీటికి కొరత లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న చొరవతోనే వ్యవసాయానికి ఢొకా లేకుండా పోతోందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క రాష్ట్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూనే పొరుగు రాష్ట్రాల నుండి కూడా సమకూర్చుకుంటున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ కారణంగానే ఇటు అన్నదాతలు, అలాగే గృహ , పారిశ్రామిక వర్గాలు సిఎం కెసిఆర్ చొరవ పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు. గతంలో ఎప్పుడు చూసినా కరెంటు ఉండేదే కాదని, ఇప్పుడా పరిస్థతి లేదని వారు వివరిస్తున్నారు.

సిఎం కెసిఆర్ వల్లే మా సాగునీటి ఇక్కట్లు తీరాయి.. వేణు ..యువ రైతు

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, జగదీశ్ రెడ్డి, హరీష్ రావు తదితరుల కృషి వల్లే తమకు సాగునీటికి బాధలు తీరాయని సిద్దిపేట జిల్లా యువ రైతు వేణు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రైతులకు కావలసింది విద్యుత్ కాబట్టి రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో తాము జనవరి చివరి మాసంలో వరినాట్లు వేసే వాళ్లం కానీ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా అది కూడా ఇలా ముందస్తుగా డిసెంబర్ నెలలోనే వరి నాట్లు వేస్తున్నామని “ మన తెలంగాణ” కు వివరించారు. ఇదంతా కూడా వ్యవసాయ రంగానికి విద్యుత్‌ను సరిపడా సరఫరా చేయడంతోనే సాధ్యం అయ్యిందని యువ రైతు వేణు అంటున్నారు.

రోజు వారీగా టిఎస్ ట్రాన్స్‌కో విద్యుత్ వినియోగ డిమాండ్ ఇలా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News