Tuesday, February 4, 2025

తక్కువ జననాల రేటుతో కుప్పకూలనున్న యూరొప్: మస్క్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యూరొప్ లో రికార్డు స్థాయిలో తక్కువ జననాల రేటు ఉండడం వల్ల కుప్పకూలనుందని ఎలాన్ మస్క్ అన్నారు. అనేక నాగరికతలు అంతరించిపోయినట్లుగా యూరొప్ నగరికత కూడా అంతరించిపోగలదని హెచ్చరించారు.

‘గ్రేట్ రీప్లేస్‌మెంట్’ సిద్ధాంతం యొక్క ఆలోచనను ప్రోత్సహించే డచ్ రాజకీయ వ్యాఖ్యాత ఎవా వ్లార్డింగర్‌బ్రూక్‌కు సమాధానమిస్తూ, టెక్ బిలియనీర్, తక్కువ జనన రేటు యొక్క పునాది సమస్యను పరిష్కరించడంలో విఫలమవడమే సిద్ధాంతంతో సమస్య అని’ అన్నారు.

“రికార్డ్ స్థాయి తక్కువ జనన రేట్లు ఐరోపాలో జనాభా పతనానికి దారితీస్తున్నాయి , ఆసియాలో కంటే చాలా వేగంగా   యూరొప్ జనాభా పతనానికి దారితీస్తున్నాయి. ఆసియాలో ఇమ్మిగ్రేషన్ తక్కువగా ఉంది, కాబట్టి ‘భర్తీ’ జరగడం లేదు, దేశాలు కేవలం తగ్గిపోతున్నాయి, ”అని టెస్లా సిఈవో ఉద్ఘాటించారు.

‘ఒకవేళ ఈ స్థితి మారకుంటే తక్కువ జనన రేట్లున్న ఏ దేశమైనా ఖాళీ అయిపోయి, పతనమై పోతుంది. ఇదివరలో అనేక నాగరికతలు పతనమైన స్థితిని కూడా మనం చూశాం’ అని మస్క్ వాదించారు. కాగా  ‘గ్రేట్ రీప్లేస్‌మెంట్’  అనేది ఒక సిద్ధాంతం కాదు, వాస్తవికత అని వ్లార్డింగర్‌బ్రూక్ పోస్ట్ చేశాడు.

‘గ్రేట్ రీప్లేస్‌మెంట్’ సిద్ధాంతం దాని “అసంబద్ధత” కారణంగా విస్తృతంగా విమర్శించబడింది. కాగా దక్షిణ కొరియా యొక్క సంతానోత్పత్తి రేటు 2023లో తాజా రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. జపాన్, చైనా వంటి దేశాలు కూడా తక్కువ జనన రేటుతో పోరాడుతున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News