Sunday, December 22, 2024

నీట్‌కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యుజి ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ ఏడాది 20.87 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువని అధికారులు వెల్లడించారు. ఈసారి అభ్యర్థుల్లో అమ్మాయిలే (11.8లక్షల మంది) ఎక్కువ ఉండటం విశేషం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా, మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News