సగటున 20 సెంటిమీటర్ల వర్షపాతం
హైదరాబాద్: నగరంలో ఈ ఏడాది జూలైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదుకాగా సగటున 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. వానాకాలం మొత్తం కురివాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టినట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. నగరంలో వాన పడింది. ఆల్‌టైం రికార్డుగా 42.2 సెం.మీ. వాన 1989లో నమోదుకాగా ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీలు కాగా, రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్ జిల్లాలో 287.6 మి.మీ.గాలు ఉంది. నెల ముగిసేందుకు ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఆయా జిల్లాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో 400 మి.మీలుపైగా వర్షపాతం నమోదు కావడం గమన్హారం.
200ల నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిన ప్రాంతాలు
హయత్‌నగర్, సరూర్‌నగర్, ఉప్పల్, కాప్రా, బాలానగర్, మల్కాజిగిరి, మారేడుపల్లి, ముషీరాబాద్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో రెండు నెలల్లో 400 మి.మీల వర్షపాతం నమోదు కాగా, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, షేక్‌పేట, గోల్కొండ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, నాంపల్లి, అంబర్పేట, సైదాబాద్, బహుదూర్‌పురా, రాజేంద్రనగర్, బండ్లగూడ, చార్మినార్ ప్రాంతాల్లో 251 నుంచి 400 మి.మీల మధ్య వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణకంటే అధిక వర్షపాతం
సాధారణకంటే అధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 172 శాతం, ఉప్పల్‌లో 150శాతం, కాప్రాలో 128శాతం, ఘట్‌కేసర్‌లో 115శాతం, ముషీరాబాద్‌లో115శాతం, మీర్‌పేటలో 116శాతం, కీసరలో 102 శాతం, మేడిపల్లిలో 102 శాతం వర్షపాతం నమోదయ్యింది.