Friday, November 22, 2024

రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండాకాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి. ఒక్క మే నెలలోనే 7.44 కోట్లు బీరు బాటిళ్లను మందుబాబులు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా నెల రోజుల వ్యవధిలో ఈ బీర్లను తాగేయడం గమనార్హం. మే నెలలో ఎండలు విపరీతంగా ఉండటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 2019 మే నెలలో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్లు అమ్ముడుకాగా తాజాగా ఆ రికార్డును బద్దలు కొడుతూ ఈ సంవత్సరం మే నెలలో 7.44 కోట్ల బీర్లను మద్యం
ప్రియులు తాగేయడం విశేషం.

బుధవారం ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు
మే నెలలో రూ.3,285 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా అందులో బుధవారం ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మే నెలలో అత్యధికంగా 64,48,469లక్షల కేసుల బీర్ల అమ్మకాలతో పాటు 30,66,167లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం (మే, 31వ తేదీ) ఒక్కరోజే 2,55,526లక్షల కేసుల బీర్లు, 3,31,961 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం 2022 మే నెలలో 55,72,000 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా, 27,11,000 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు తెలిపాయి.

రోజుకు రూ.150 కోట్ల పైచిలుకు ఆదాయం
తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 కోట్లు విలువైన మద్యం విక్రయం జరుగుతోంది. 2022-,23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News